నూతన గృహానికి శంకుస్థాపన చేసిన బన్నీ

నూతన గృహానికి శంకుస్థాపన చేసిన బన్నీ

Published on Oct 4, 2019 1:24 AM IST

aa1

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ త్వరలో తన సొంతింటి కలను నెరవేర్చుకోబోతున్నాడు.నేడు ఆయన తాను నిర్మించబోతున్న కొత్త ఇంటికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు.తన భార్య స్నేహారెడ్డి, కుమారుడు, కుమార్తెతో కలసి కొత్త ఇంటికి శాస్త్రోత్తరంగా పూజ చేశారు. అంతా కలిసి ఇటుకలను పేర్చి, సిమెంట్ వేస్తున్న ఫొటోను అల్లు అర్జున్ ఫేస్ బుక్ ద్వారా షేర్ చేశారు.

సొంత ఇంటికి ‘బ్లెస్సింగ్’ అనే పేరు పెట్టారు. ఈ విషయం తెలిసిన అల్లు అభిమానులు వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా ఇప్పటి వరకు అల్లు అర్జున్ తన తండ్రి అరవింద్ తో కలిసి ఉంటున్నారు. తాజాగా తమ కలల ఇంటిని నిర్మించుకొని కొత్త జీవితం ప్రారంభించాలి నిర్ణయించుకున్నారు. అల్లు అర్జున్ త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అలవైకుంఠపురంలో మూవీ షూటింగ్ జరుపుకుంటుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మరియు గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో బన్నీకి జంటగా పూజా హెగ్డే నటిస్తుండగా, సీనియర్ హీరోయిన్ టబు, సుశాంత్, నివేదా పేతురాజ్, నవదీప్ కీలక పాత్రలు చేస్తున్నారు. ఇక ఈ చిత్రానికి సంగీతం ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు