ది వన్ స్టార్ హీరో సూర్య హీరోగా మమితా బైజు హీరోయిన్ గా దర్శకుడు వెంకీ అట్లూరి కలయికలో వచ్చిన లేటెస్ట్ చిత్రమే ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. ఒక క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ చిత్రం ఇపుడు బాక్సాఫీస్ దగ్గర వండర్స్ సెట్ చేస్తుంది. గత కొన్ని నెలల కితమే సూర్య నటించిన కరుప్పు/వీర భద్రుడు చిత్రం మాస్ ఆడియెన్స్ ని ఆకట్టుకొని అదరగొట్టింది.
అయితే అది మాస్ సినిమా ఇది క్లాస్ సినిమా కదా అని చాలా మందిలో ఈ సినిమా పెర్ఫామెన్స్ పై డౌట్ ఉంది. కానీ ఈ క్లాస్ సినిమాతో కూడా సూర్య మాస్ బ్యాటింగ్ చేస్తున్నాడని చెప్పాలి. ప్రస్తుతం బుక్ మై షోలో ఈ సినిమా బుకింగ్స్ చూస్తే ఊహించని రేంజ్ లో ఉన్నాయని చెప్పాలి.
రెండు వెర్షన్స్ లో కలిపి గంటకి 36 వేల మేర టికెట్ సేల్స్ జరుగుతున్నాయి. దీనితో రెండో రోజు కూడా ఈ సినిమా భారీ బుకింగ్స్ సొంతం చేసుకుంటుంది అని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ నిర్మాణం వహించారు.



