మొదటి చిత్రం అల్లుడు శ్రీను తో మాస్ హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ స్పీడున్నోడు, జయజానకి నాయక వంటి వరుస యాక్షన్ మూవీస్ లో నటించి యాక్షన్ హీరోగా టాలీవుడ్ లో పేరుతెచ్చుకున్నాడు. ఐతే తాజాగా రాక్షసుడు అనే క్రైమ్ థ్రిల్లర్ తో మంచి హిట్ అందుకున్నారు. దర్శకుడు రమేష్ వర్మ తెరకెక్కించిన రాక్షసుడు బెల్లంకొండ శ్రీనివాస్ కు మంచి హిట్ ఇవ్వడంతో పాటు ఆయన అపజయాల పరంపరకు తెరదింపింది.
ఈ మూవీ తరువాత కథల ఎంపిక విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిర్ణయించుకున్న శ్రీనివాస్ ఫైనల్ గా ఓ మూవీ ఒకే చేశారు. రామ్ తో కందిరీగ చిత్రం చేసి మొదటి చిత్రంతోనే హిట్ అందుకున్న దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ తో మూవీ చేయడానికి బెల్లంకొండ పచ్చ జెండా ఊపారు. సంతోష్ శ్రీనివాస్ చెప్పిన యాక్షన్ మూవీ స్క్రిప్ట్ నచ్చడంతో ఆయన ఈ చిత్రంలో నటించడానికి ఒకే చెప్పారని సమాచారం. సినిమాటోగ్రాఫర్ నుండి దర్శకుడిగా మారిన సంతోష్ శ్రీనివాస్ ఎన్టీఆర్ తో రభస, రామ్ తో హైపర్ చిత్రాలు తెరకెక్కించారు. ఇది ఆయన చేస్తున్న నాల్గవ చిత్రం. త్వరలో సెట్స్ పైకెళ్ళనున్న ఈ మూవీ పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సివుంది.


