ఇంకో రెండు నెలల్లో సినిమాను ప్రకటిస్తానంటున్న సూపర్ స్టార్

ఇంకో రెండు నెలల్లో సినిమాను ప్రకటిస్తానంటున్న సూపర్ స్టార్

Published on Oct 4, 2019 3:11 PM IST

Shahrukh

బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ కెరీర్ కొన్నేళ్ళుగా తీవ్ర సంక్షోభంలో ఉంది. ఆయన గత చిత్రాలు ‘జీరో, ట్యూబ్ లైట్, రాఈస్, జబ్ హ్యారీ మెట్ సెజల్’ లాంటి సినిమాలు ఊహించని రీతిలో విఫలమయ్యాయి. ఈ వరుస పరాజయాలతో షారుక్ సైతం ఎన్నడూ లేనంతగా కలవరానికి గురయ్యారు. అందుకే కొన్నాళ్లు సినిమాల నుండి బ్రేక్ తీసుకున్నారు.

ఈ విరామంలోనే తనకు ఎలాంటి సినిమాలు సూటవుతాయో ఒక అంచనాకు వచ్చిన ఆయన రెండు కథల మీద వర్క్ చేస్తున్నారట. తాజాగా ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ‘దూమ్ 4, డాన్ 3, కిల్ బిల్ రీమేక్’ వంటి ప్రాజెక్ట్స్ చేస్తున్నట్టు వస్తున్న వార్తలన్నీ రూమర్స్ అని కన్ఫర్మ్ చేసి ఇంకో రెండు మూడు నెలల్లో ప్రాజెక్ట్ సెట్టయ్యే సూచనలున్నాయని, అప్పుడు అనౌన్స్ చేస్తానని చెప్పుకొచ్చారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు