మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి నటిస్తున్న భారీ చిత్రం మామాంగం. మాలీవుడ్ లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మలయాళ బాహుబలి చిత్రంగా వర్ణిస్తున్నారు. కావ్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై వేణు కున్నపల్లి తెరకెక్కిస్తున్న ఈ చిత్ర టీజర్ ని నేడు విడుదల చేశారు.
పదహారవ శతాబ్దంలో కేరళలో జరిగిన ఒక చారిత్రక పండుగ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. మామాంగం అనే సాంప్రదాయ వేడుక నిర్వహణలో వర్గాల మధ్య తలెత్తిన ఘర్షణల ఆధారంగా ఈ మూవీ రూపొందించారు. దర్శకుడు పద్మ కుమార్ తెరకెక్కించిన ఈ మూవీకి జయచంద్రన్ సంగీతం అందించారు. హిందీ, తమిళ,తెలుగు మలయాళ భాషలలో మమంగం చిత్రం వచ్చే నెలలో విడుదల కానుంది.
టీజర్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి


