ప్రభాస్ ఫ్యాన్స్ కి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడా…?

ప్రభాస్ ఫ్యాన్స్ కి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడా…?

Published on Oct 25, 2019 3:00 AM IST

Prabhas2

ప్రభాస్ ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 17ఏళ్ళు అవుతుంది. ఇప్పటివరకు ఆయన చేసింది కేవలం 19సినిమాలే. 2013లో మిర్చి మూవీ విడుదలైన తరువాత ఆరున్నరేళ్లలో ఆయన చేసింది కేవలం మూడు సినిమాలే. బాహుబలి రెండు చిత్రాలు మరియు సాహో కొరకు ప్రభాస్ ఇంత సమయం కేటాయించడం జరిగింది. సాహో తరువాత భారీ బడ్జెట్ చిత్రాలు చేయను అన్నారు ప్రభాస్. భారీ బడ్జెట్ కావడం వలన స్ట్రెస్ ఎక్కువైపోతోందని అన్నారు. అలాగే ఫ్యాన్స్ నిరాశ పడకుండా ప్రతి ఏడాది రెండు చిత్రాలు విడుదలయ్యేలా చూస్తాను అని చెప్పుకొచ్చారు.

గతంలో కూడా బాహుబలి తరువాత వేగంగా చిత్రాలు చేస్తానని ప్రభాస్ ఫ్యాన్స్ కి చెప్పడం జరిగింది. కానీ సాహో చిత్రం కోసం మళ్ళీ ఆయన రెండేళ్ల సమయం తీసుకున్నారు. అనుకోకుండా సాహో బడ్జెట్ మరియు సమయం పెరిగిపోయాయని వివరణ ఇచ్చారు. మరి ప్రభాస్ తీరు చూస్తుంటే ఆయన ఈ సారి కూడా మాట నిలబెట్టుకునేలా కనిపించడం లేదు. సాహో విడుదల తరువాత ఆయన జాన్ మూవీ షూటింగ్ మొదలుపెట్టినట్లు లేదు. మరి జాన్ మూవీ చిత్రీకరణ ఎప్పుడు పూర్తి చేస్తారు? మరో చిత్రం ఎప్పుడు మొదలుపెడతారు అనేది పెద్ద ప్రశ్న?.

తాజా వార్తలు