శర్వానంద్ హీరోగా, సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా ‘భోగి’. ఇప్పటికే ఈ సినిమా ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. అయితే, తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఒక సాలిడ్ అప్‌డేట్‌ను మేకర్స్ రివీల్ చేశారు.
ఈ సినిమాకు సంబంధించిన భారీ, యాక్షన్ ప్యాక్డ్ షెడ్యూల్ విజయవంతంగా పూర్తయినట్లు చిత్ర బృందం ప్రకటించింది. ప్రతి ఫ్రేమ్‌లోనూ శర్వానంద్ పడుతున్న శ్రమ, ఆయన పెర్ఫార్మెన్స్ అద్భుతంగా రాబోతోందని, రోజురోజుకూ ఈ ప్రాజెక్ట్ మరింత గ్రాండ్‌గా, పవర్‌ఫుల్‌గా రూపుదిద్దుకుంటోందని మేకర్స్ ఎంతో ఉత్సాహంగా తెలియజేశారు.
‘శర్వా-సంపత్ బ్లడ్ ఫెస్ట్’గా రాబోతున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ మాస్ అండ్ రా యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై అప్పుడే ఫిలిం వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
💯 Brutal..
💯Beautiful..
Another Action Loaded Schedule…Wrapped✅@ImSharwanand garuu… your effort speaks in every frame❤️🔥#BHOGI keeps getting bigger, tougher n more excitingggg🔥My Action Beast @dhilipaction garu, DoP Ace @kishorkumardop brother n the entire… pic.twitter.com/wucFzt9mvZ
— Sampath Nandi (@IamSampathNandi) August 13, 2026


