ఈరోజు దీపావళి పండుగ కావడంతో సెట్స్ మీదున్న సినిమాల నుండి కొత్త పోస్టర్లు, అప్డేట్స్ వెల్లువెత్తుతున్నాయి. అలా ఈరోజు అప్డేట్స్ ఇచ్చిన సినిమాల్లో మహేష్ యొక్క ‘సరిలేరు నీకెవ్వరు’, నితిన్ ‘భీష్మ’ కూడా ఉన్నాయి. ఈ చిత్రాలకు సంబంధించిన బ్రాండ్ న్యూ పోస్టర్స్ కొద్దిసేపటి క్రితమే విడుదలయ్యాయి.
అవి రెండూ కూడా ఆ సినిమాల్లో కథానాయకిగా నటిస్తున్న రష్మిక మందన్నను పరిచయం చేసే పోస్టర్లే కావడం విశేషం. దీంతో సోషల్ మీడియా మొత్తం రష్మిక హడావిడే కనిపిస్తోంది. రెండు చిత్రాల్లోనూ అమె లుక్స్ ఆకట్టుకునేలా ఉండటంతో ప్రేక్షకులు, అభిమానుల నుండి మంచి ఫీడ్ బ్యాక్ వస్తోంది.
కెరీర్ ఆరంభంలోనే మహేష్ లాంటి స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ దక్కించుకుని సెన్సేషన్ సృష్టించిన
రష్మిక ప్రస్తుతం చేస్తున్న సినిమాలు గనుక మంచి విజయాల్ని సాధిస్తే స్టార్ హీరోయిన్ల జాబితాలో ఖచ్చితమైన స్థానాన్ని దక్కించుకోవడం ఖాయం.


