మొత్తానికి రామ్ గోపాల్ వర్మ తన వివాదాస్పద సినిమాలను అలాగే కంటిన్యూ చేస్తూ.. తెరకెక్కిస్తోన్న ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమా నుండి దీపావళి కానుకగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశాడు వర్మ. అయితే ఈ సారి ట్రైలర్ లో టీడీపీతో పాటు వైసీపీని కూడా టార్గెట్ చేశాడు. మన ప్రభుత్వం పై ప్రజలకు పూర్తిగా నమ్మకం పోతుంది అని ఒక పాత్ర జగన్ పాత్రతో చెబుతుంది. అలాగే బాబు పాత్రను ఎప్పటిలాగే నెగిటివ్ గా ఎస్టాబ్లిష్ చేయగా లోకేష్ పాత్రను, పవన్ కళ్యాణ్ పాత్రను, పాల్ పాత్రను ఫన్నీగా చూపించాడు. ట్రైలర్ ప్రస్తుతం నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది.
కాగా కులాల్ని పార్టీలను బేస్ చేసుకుని ఉండనున్న ఈ ప్రాజెక్ట్ పట్ల మొదట్లోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనా వర్మ మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గలేదు. కులంతో పాటు రాజకీయ నాయకులను వ్యక్తగతంగా కూడా వర్మ టార్గెట్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమా ట్రైలర్ ను టీడీపీ కార్యకర్తలతో పాటు జనసేనాని అభిమానులు కూడా ఏ మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ఏమైనా సినిమా పేరుతోనే రెండు ప్రధాన సామాజిక వర్గాల నడుమ జరిగే రాజకీయ పోరును, అలాగే ప్రస్తుత రాజకీయ అంశాలను వర్మ సినిమాగా తీస్తున్నాడట. అసలు టైటిలే వివాదాస్పదంగా ఉందనుకుంటే.. సినిమా ట్రైలర్ అంతకన్నా వివాదాస్పదంగా ఉంది.
ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


