‘నిశ్శబ్దం’గా ప్రీ టీజర్ !

‘నిశ్శబ్దం’గా ప్రీ టీజర్ !

Published on Oct 27, 2019 10:40 AM IST

nishabdaaam

హేమంత్ మధుకర్ దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రలో రాబోతున్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘సైలెన్స్’. తెలుగులో ఈ సినిమా ‘నిశ్శబ్దం’గా రానుంది. కాగా తాజాగా ఈ సినిమా నుండి దీపావళి కానుకగా ప్రీ టీజర్ ను రిలీజ్ చేసింది చిత్రబృందం. ఇంట్రస్టింగ్ థీమ్ మ్యూజిక్ తో పాటు బ్యూటిఫుల్ విజువల్స్, మరియు క్యారెక్టర్స్ యొక్క యాక్టివిటీస్ ఎస్టాబ్లిష్మెంట్స్ చాల బాగున్నాయి. ప్రసుతం ఈ ప్రీ టీజర్ నెటిజన్లను బాగానే ఆకట్టుకుంది.

ఇక ఈ సినిమాలో సప్సెన్స్ ఎలిమెంట్స్ చాల బాగా వచ్చాయని.. సినిమాకే హైలెట్ గా నిలుస్తాయని తెలుస్తోంది. ముఖ్యంగా సెకెండ్ హాఫ్ లో వచ్చే ప్రీ క్లైమాక్స్ అండ్ ట్విస్ట్ లు సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయట. ఈ సినిమాలో అనుష్క ఆర్ట్ లవర్ గా కనిపించనుంది. ఇక మాధవన్ ఈ సినిమాలో సెల్లో ప్లేయర్ గా నటించనున్నాడు.

ఇక ఈ చిత్రంలో అనుష్క, మాధవన్ లతో పాటు సుబ్బరాజు, అంజలి, షాలిని పాండే తో పాటు ప్రముఖ హాలీవుడ్ నటుడు మైఖేల్ మాడిసన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ‘భాగమతి’గా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకున్న అనుష్క.. మరి ఈ సినిమాతో కూడా సూపర్ హిట్ అందుకుంటుందేమో చూడాలి. రచయిత కోన వెంకట్ తన బ్యానర్‌ లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ప్రీ టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

తాజా వార్తలు