‘మంచు మనోజ్‌’ కొత్త జర్నీ మొదలైంది !

‘మంచు మనోజ్‌’ కొత్త జర్నీ మొదలైంది !

Published on Oct 27, 2019 4:20 PM IST

manoj

మంచు మనోజ్‌ ఇప్పటికే సినిమాలకు చాల గ్యాప్ ఇచ్చారు. అయితే ఎట్టకేలకు మళ్లీ సినిమాల్లో యాక్టివ్ కాయబోతున్నారు. అయితే ఈ సారి మనోజ్ కొత్త అవతారం ఎత్తబోతున్నారు. ఇండస్ట్రీలో కొత్త టాలెంట్‌ ను ఎంకరేజ్‌ చేయాలని ‘ఎమ్‌ఎమ్‌ ఆర్ట్స్‌’ పేరుతో సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ఈ విషయాన్ని మంచు మనోజ్‌ స్వయంగా ఈ రోజు ట్విట్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు.

ఈ సందర్భంగా మనోజ్ ట్వీట్ చేస్తూ.. ‘నా కొత్త జర్నీ మొదలైంది. . నా సొంత నిర్మాణ సంస్థ ‘ఎమ్‌ఎమ్‌ ఆర్ట్స్‌’నిర్మాణంలోనే నా తదుపరి చిత్రాలు వస్తాయి. అదేవిధంగా కొత్త టాలెంట్‌ కు సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతోనే నిర్మాణరంగంలోకి అడుగుపెట్టాను. భవిష్యత్‌ లో మా నిర్మాణ సంస్థ నుంచి వచ్చే మంచి చిత్రాలను మీరు చూస్తారు. ఎమ్‌ఎమ్‌ ఆర్ట్స్‌ తరుపున మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు. లవ్‌ యూ ఆల్‌’ అని మంచు మనోజ్‌ పోస్ట్ చేశారు. మరి మంచు మనోజ్‌ నిర్మాణ రంగంలోనూ విజయం సాధించాలని కోరుకుందాం.

unnamed

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు