దేశముదురు సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమైంది హాట్ బ్యూటీ హన్సిక. అయితే ఆ తరువాత తమిళ సినిమాలే ఎక్కువుగా చేస్తూ అక్కడ ఆడియన్స్ కి ఫేవరేట్ హీరోయిన్ గా మారింది. కాగా హన్సికకు దీపావళి సందర్భంగా ఖరీదైన కారును గిఫ్ట్ గా ఇచ్చారు ఆమె తల్లి మనో మొత్వాని. ఏకంగా రూ.10కోట్లకు పైగా ఖరీదైన రోల్స్ రాయిస్ కారును తన కూతురుకి గిఫ్ట్ గా ఇచ్చింది మనో. తన తల్లి గిఫ్ట్ ఇస్తున్న ఆ వీడియోను హన్సిక సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఇక ప్రస్తుతం హన్సిక తెలుగులో తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్ సినిమా మాత్రమే చేస్తోంది. కామెడీ చిత్రాల దర్శకుడు జి.నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా రాబోతున్న ఈ సినిమాలో హన్సికది ప్రధానమైన రోల్ అని తెలుస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఫుల్ బిజీగా ఉన్న ఈ సినిమా విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నారు.
https://twitter.com/IHansika_Islife/status/1187649872775696390


