ఒకప్పుడు రామ్ గోపాల్ వర్మ సినిమా తీస్తే వివాదం అయ్యేది.. కానీ ఇప్పుడు కేవలం వివాదం కోసమే ఆయన సినిమాలు తీస్తున్నట్టు కనిపిస్తున్నారు. ప్రస్తుతం ‘కమ్మరాజ్యంలోకి కడప రెడ్లు’ అంటూ పొలిటికల్ బ్యాక్ డ్రాప్లో ఒక సినిమా తీస్తున్నాడు వర్మ. ఏపీ రాజకీయాల్లోని ముఖ్య వ్యక్తుల గురించే ఈ చిత్రం. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ రాజకీయ, సినీ వర్గాల్లో అలజడి సృష్టించింది. ఈ సినిమా విడుదల నాటికి గొడవలు తప్పవని ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరు భావిస్తున్నారు.
ఈ ట్రైలర్ హడావుడి జరుగుతుండగానే ‘మెగా ఫ్యామిలీ’ పేరుతో ఇంకో కొత్త సినిమాను ప్రకటించాడు ఆర్జీవీ. టైటిల్ చూసిన నెటిజన్లు వర్మ టార్గెట్ చేసింది మెగా ఫ్యామిలీనే అని అర్థం చేసుకున్నారు. ఇక మెగా అభిమానులైతే వర్మ మీద ఫైర్ అవుతున్నారు. ఈ సినిమా గురించి పూర్తి డీటైల్స్ ఈరోజు చెప్తానన్న వర్మ మెగా ఫ్యామిలీ అనే సినిమా 39 మంది పిల్లలున్న ఒక వ్యక్తి గురించి. ఎక్కువమంది పిల్లలున్నారు, పైగా నేను పిల్లల సినిమాలను బాగా తీయలేను. అందుకే ఈ సినిమా తీయకూడదని డిసైడ్ అయ్యాను అంటూ అసలు విషయాన్ని రివీల్ చేశాడు.
వర్మ ఇలా జోక్ చేయడం చూసిన కొందరు కేవలం టైమ్ పాస్ కోసం, కాసేపు హడావుడి చేయడం కోసం ఇలా మనుషుల భావోద్వేగాలతో ఆడుకోవడం సరికాదని అంటుంటే వర్మ ఇలాంటిదే ఏదో చేస్తాడని తమకు తెలుసని, అందుకే ఆ వార్తను లైట్ తీసుకున్నామని ఇంకొందరు అంటున్నారు.


