వారిని ఎంకరేజ్ చెయ్యడం నా బాధ్యత – విజయ్ దేవరకొండ

వారిని ఎంకరేజ్ చెయ్యడం నా బాధ్యత – విజయ్ దేవరకొండ

Published on Oct 31, 2019 12:01 AM IST

meku2

తరుణ్‌ భాస్కర్‌ హీరోగా షామీర్ సుల్తాన్‌ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ నిర్మించిన చిత్రం ‘మీకు మాత్రమే చెప్తా’ ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. విజయ్ దేవరకొండ, పూరి జగన్నాధ్, సురేష్ బాబు, మధురా శ్రీధర్, కె.ఎస్.రామారావు, పరుశురాం, శివ నిర్వాణ,ఛార్మి, తరుణ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ…కొత్త ప్రొడక్షన్ హౌస్, కొత్త టెక్నీషియన్స్ అందరూ కలిసి చేస్తున్న సినిమా ఇది. మా సినిమాను దీవించడానికి వచ్చిన అందరికి ధన్యవాదాలు. ముఖ్యంగా నిర్మాత సురేష్ బాబు గారికి థాంక్స్, ఆయన నా మొదటి సినిమా నుండి సపోర్ట్ చేస్తున్నారు. డైరెక్టర్స్ పూరి గారు, పరుశురాం, శివ నిర్వాణ నాకోసం ఈ ఈవెంట్ కు రావడం సంతోషంగా ఉంది. నేను 5,6 ఏళ్ల క్రిందట టీవీలో సినిమా సెలెబ్రిటీస్ ను చూసేవాడిని, వారిని చూసి నేను కూడా ఒక నటుణ్ని అవ్వాలనే కోరిక ఉండేది, ఆ సమయంలో నాన్న నన్ను పూరి గారి దగ్గర వర్క్ చెయ్యమని చెప్పారు. ఇప్పుడు పూరి గారితో సినిమా చేయడం మర్చిపోలేని అనుభూతి. కలలు కనండి, వాటిని నిజం చేసుకోవడానికి కష్టపడండి. నన్ను చాలామంది సపోర్ట్ చెయ్యడంతో ఈ స్థానంలో ఉన్నాను కావున నేను కొత్త వారిని సపోర్ట్ చేస్తున్నాను. తరుణ్ భాస్కర్, పరుశురాం, సందీప్ రెడ్డి వంగ నా సక్సెస్ కు కారణం. మీకు మాత్రమే చెప్తా సినిమా అందరికి నచ్చుతుందని భావిస్తున్నాను అన్నారు.

తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ… నేను ఎదుగుతున్న సమయంలో మా నాన్న సపోర్ట్ మరువలేనిది. నాకు నటన అనేది ఇష్టం కావున నేను నటుస్తూ వెళుతున్న. డైరెక్టర్ షమ్మిర్ బాగా కష్టపడి ఈ సినిమా తీశారు. విజయ్ దేవరకొండ చేస్తున్న అన్ని ప్రయత్నాలు సక్సెస్ కావాలని కోరుకుంటున్న, తాను నిర్మించిన ఈ చిత్రం అందరికి నచ్చుతుందని భావిస్తున్నాను అన్నారు.

నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ… అందరికి నమస్కారం. విజయ్, తరుణ్ ఇప్పుడు సక్సెస్ ఫుల్ పర్సన్స్, వారు ఎదిగిన విధానం చూస్తుంటే ముచ్చటగా ఉంది. మీకు మాత్రమే చెప్తా ట్రైలర్ చూశాను బాగా నచ్చింది. చిన్న సినిమాలను సపోర్ట్ చేసే విజయ్ దేవరకొండకు ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. నవంబర్ 1న విడుదల కాబోతున్న ఈ సినిమాను అందరూ చూసి హిట్ చెయ్యాలని కోరుకుంటున్న అన్నారు. నిర్మాత మధుర శ్రీధర్ మాట్లాడుతూ… నేను ఈ సినిమా చూశాను, నాకు బాగా నచ్చింది. సినిమా అంతా నవ్వుతూనే ఉంటారు. కామెడీ సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూ ఉంటారు. ఈ సినిమా కూడా సక్సెస్ అవుతుంది. సినిమా సక్సెస్ అవుతుందని ముందే చిత్ర యూనిట్ సభ్యులకు కంగ్రాట్స్ చెబుతున్నాను అన్నారు.

డైరెక్టర్ షామీర్ మాట్లాడుతూ… నాకు ఈ సినిమా చెయ్యడానికి అవకాశం ఇచ్చిన విజయ్ దేవరకొండ, వర్ధన్ గారికి
థాంక్స్. తరుణ్ భాస్కర్ రాకేష్ పాత్రలో ఎనర్జీ గా నటించాడు, షూటింగ్ సమయంలో తను నాకు బాగా సపోర్ట్ చేసాడు. మ్యూజిక్, ఎడిటింగ్ ఇలా అన్ని విభాగాల సినిమా కోసం కష్టపడి పనిచేశారు. అభినవ్, అనసూయ పాత్రలు ప్రేక్షకులను అలరిస్తాయి. మీకు మాత్రమే చిత్రం విడుదల తరువాత అందరి పాత్రలు ప్రేక్షకులకు గుర్తుండిపోతాయి. ఆడియన్స్ సినిమా చూస్తున్నంత సేపు ఎంజాయ్ చేస్తారన్నారు.

తాజా వార్తలు