బాలయ్య సినిమాకు బాలీవుడ్ హంగులు

బాలయ్య సినిమాకు బాలీవుడ్ హంగులు

Published on Dec 12, 2019 12:11 PM IST

Balakrishna Boyapati Srinu1

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల ప్రాజెక్ట్ ఇటీవలే లాంఛ్ అయిన సంగతి తెలిసిందే. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని చాలా ప్రత్యేకంగా తీర్చిదిద్దాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. అందుకే చిత్రానికి బాలీవుడ్ హంగులు అద్దే ప్రయత్నంలో ఉన్నారు. ముందుగా ప్రతినాయకుడిగా బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ను తీసుకోవాలని, ఆయన్ని సంప్రదించాలనే ప్రయత్నాల్లో ఉన్నాడట బోయపాటి.

అంతేకాదు కథానాయకిగా హిందీ స్టార్ నటి సొనాక్షి సిన్హాను తీసుకోవాలని భావిస్తున్నారట. ఈ ప్రయత్నాలన్నీ ఫలిస్తే బాలయ్య సినిమాలో బాలీవుడ్ మెరుపులు భారీగా ఉండే అవకాశం ఉంది. ఈ ప్రయత్నం ఇంకో రకంగా సినిమాకు హెల్ప్ అయ్యే అవకాశం ఉంది. ఎలా అంటే.. ప్రముఖ హిందీ నటులు నటించడం వలన సినిమా హిందీ డబ్బింగ్, యూట్యూబ్ రైట్స్ మంచి ధరకు అమ్ముడయ్యే అవకాశం ఉంది. ఇది ఒక రకంగా నిర్మాతలకు కలిసొచ్చే అంశమే అవుతుంది.

తాజా వార్తలు