శర్వా సరికొత్త మేకోవర్‌.. ఫస్ట్ షెడ్యూల్ ఫిక్స్ !

శర్వా సరికొత్త మేకోవర్‌.. ఫస్ట్ షెడ్యూల్ ఫిక్స్ !

Published on Aug 10, 2026 2:59 PM IST

దర్శకుడు శ్రీను వైట్ల – హీరో శర్వానంద్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా ‘జార్జ్ క్రిష్’. పైగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి శర్వానంద్ సరికొత్త మేకోవర్‌లో కనిపించబోతున్నాడు. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ వచ్చే నెల రెండో వారం నుంచి స్టార్ట్ చేయనున్నారు. ముందుగా తీయనున్న యాక్షన్ సీన్స్ కోసం ఓ భారీ సెట్ వేస్తున్నారట. ఇక ఈ సినిమాలో నటించే హీరోయిన్ గురించి ఇప్పటికే చాలా రూమర్స్ వచ్చాయి. ఐతే, తాజాగా వినిపిస్తున్న అప్ డేట్ ప్రకారం.. భాగ్యశ్రీ బోర్సే ను హీరోయిన్‌ గా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.

కాగా ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ అనంతరం జరగబోయే రెండో షెడ్యూల్ లో హీరో – హీరోయిన్ల పై లవ్ సీన్స్ ను షూట్ చేస్తారని తెలుస్తోంది. అన్నట్టు ఈ సినిమాను సంక్రాంతి బరిలో దించాలని గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఐతే, గోపీచంద్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ కామెడీ ‘విశ్వం’ ఏవరేజ్ గా నిలిచింది. దీంతో, ఎలాగైనా మళ్ళీ టాలీవుడ్ లో తన తర్వాత సినిమాతో బిజీ అయ్యేందుకు శ్రీనువైట్ల తెగ కష్ట పడుతున్నాడట. అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మించనున్నాడు.

తాజా వార్తలు