అర్జున్ సురవరం రూపంలో హీరోయిన్ లావణ్య త్రిపాఠికి రీసెంట్ గా మంచి హిటే వచ్చింది. అయితే టాలెంట్ అండ్ గ్లామర్ ఉన్నా లావణ్య కెరీర్ ఆశించిన స్థాయిలో కొనసాలేదు. కనీసం ఈ అర్జున్ సురవరం సక్సెస్ తోనైనా కెరీర్ ను మరో స్థాయికి తీసుకెళ్లదామని అమ్మడు బాగానే ప్రయత్నాలు మొదలుపెట్టింది. కానీ స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ లు ఎలా ఉన్నా.. ఓ యంగ్ హీరో సినిమాలో మాత్రం నటించబోతున్నట్లు తెలుస్తోంది. కార్తికేయ హీరోగా తెరకెక్కబోతున్న “చావు కబురు చల్లగా” చిత్రంలో లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించబోతుందట. అయితే మేకర్స్ నుండి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.
కౌశిక్ పెగళ్లపాటి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కానున్నారు. త్వరలో షూటింగ్ జరుపుకోనున్న ఈ మూవీ విభిన్నమైన కథాంశంతో తెరకెక్కనుంది. ఈ సినిమా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మాతగా రానుంది. విభిన్నమైన పాత్రలో నటించే కార్తికేయ ఈ మూవీలో బస్తీ బాలరాజు పాత్రలో కనిపించబోతున్నాడు. దర్శకుడు కౌశిక్ చెప్పిన పాయింట్ నచ్చి నిర్మాత బన్నీ వాసు ఈ సినిమాను కార్తికేయతో చేయనున్నారు.


