నేడు సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు కావడంతో అటు ఆఫ్ లైన్ లో ఇటు సోషల్ మీడియాలో కూడా అభిమానులు తమ హీరో పుట్టినరోజు వేడుకలు గ్రాండ్ గా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పుట్టినరోజుకి మహేష్ నటించిన సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ‘దూకుడు’ రీరిలీజ్ కి వచ్చింది. అయితే ఈ రీరిలీజ్ ట్రెండ్ ని తీసుకొచ్చిన మహేష్ అభిమానులని మహేష్ వింటేజ్ చిత్రాల్లో ఒకటైన బాబీ ఇప్పుడు రీరిలీజ్ కి సిద్ధం అయ్యింది. నేడు మహేష్ పుట్టినరోజు కానుకగా ఈ అనౌన్సమెంట్ వచ్చింది.
2002 లో మహేష్ బాబు ఆర్తి అగర్వాల్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మ్యూజికల్ హిట్ చిత్రాన్ని మేకర్స్ ఈ ఏడాది నవంబర్ రీరిలీజ్ కి సిద్ధం చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. శోభన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా రోమియో జూలియట్ ప్రేమ కథ తరహాలో ట్రాజెడీ లవ్ స్టోరీగా తెరకెక్కి మహేష్ బాబు అభిమానులకు ఓ చక్కటి అనుభూతిని మిగిల్చింది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ అందించిన చార్ట్ బస్టర్ ఆల్బమ్ ఇప్పటికీ మహేష్ ఫ్యాన్స్ ప్లే లిస్ట్ లో ఉంటుంది. అటువంటి హిట్ చిత్రం మళ్ళీ నవంబర్లో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రాన్ని పివి ఫిలిమ్స్ బ్యానర్ పై రీ రిలీజ్ చేస్తున్నారు.


