బాలయ్యతో చేయట్లేదని చెప్పేసింది.

బాలయ్యతో చేయట్లేదని చెప్పేసింది.

Published on Mar 22, 2020 1:31 PM IST

Payal Rajput

గత ఏడాది బాలయ్య నటించిన మూడు సినిమాలు ఆశించిన ఫలితం ఇవ్వలేదు. ఎన్టీఆర్ బియోపిక్స్ తో పాటు, రూలర్ మూవీ పరాజయం చవిచూశాయి. దీనితో బాలయ్య తనకు రెండు సూపర్ హిట్స్ ఇచ్చిన మాస్ డైరెక్టర్ బోయపాటితో చేయికలిపారు. ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉంది.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ల విషయంలో చాలా వార్తలు వస్తున్నాయి ముందుగా క్యాథరిన్ పేరు , ఆతర్వాత నయనతార పేరు వినిపించింది. ఆతర్వాత తమన్నా అన్నారు ,. తాజాగా హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ పేరు కూడా వినిపించింది. అయితే బాలయ్య సరసన పాయల్ నటిస్తుందన్న వార్తల్లో వాస్తవం లేదని తెలుస్తుంది. కొద్దిరోజులుగా వస్తున్న వార్తలపై పాయల్ స్పందించింది. తాను బాలయ్య సరసన నటించడం లేదని క్లారిటీ ఇచ్చింది. దీనితో మరి బాలయ్య హీరోయిన్ ఎవరై ఉంటారనే అనుమానం బాలయ్య ఫ్యాన్స్ లో నెలకొంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు