మన టాలీవుడ్ టాప్ సంగీత దర్శకుల్లో ఒకరైన దేవిశ్రీప్రసాద్ పనితనం కోసం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తన మార్కు సంగీతం కేవలం తనకి మాత్రమే సొంతం. బాణీ ఎలాంటిది అయినా ఏ ట్రెండ్ అయినా ఆశ్చర్య పరిచే సంగీతం తన నుంచి వస్తుంది. అయితే దేవిశ్రీప్రసాద్ నుంచి వచ్చిన ఎన్నో హిట్ ఆల్బమ్ లలో రెబల్ స్టార్ ప్రభాస్ తో చేసిన మ్యూజికల్ హిట్ పౌర్ణమి కూడా ఒకటి.
ప్రభుదేవా తీసిన ఈ సినిమాలో అన్ని పాటలు ఒకెత్తు అయితే క్లైమాక్స్ లో వచ్చే భరత వేదముగా సాంగ్ మరొక ఎత్తు. అయితే ఈ సాంగ్ పైనే ప్రముఖ సాహిత్య రచయిత రామ జోగయ్య శాస్త్రి ఓ షాకింగ్ ఫ్యాక్ట్ రివీల్ చేశారు. ఇప్పటి వరకు అంతా ఈ సాంగ్ ని దేవిశ్రీప్రసాద్ కేవలం ఆ సినిమా సమయంలోనే కంపోజ్ చేసాడు అనుకుంటే పొరపాటే..
చెప్తే నమ్మరు కానీ ఆ పాటని దేవిశ్రీప్రసాద్ కేవలం తన 8వ ఏట లోనే కంపోజ్ చేసినట్టు రామ జోగయ్య శాస్త్రి తెలిపారు. ఇది మాత్రం ఊహించని అంశం అని చెప్పాలి. దీనితో దేవిశ్రీప్రసాద్ అభిమానులు తమ ఫేవరేట్ సంగీత దర్శకుడు పట్ల మరింత ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
This song originally composed by @ThisIsDSP garu at the age of 8 and destined to be part of the film years after..child prodigy he is ❤️👍 https://t.co/hpBzhUmF0T
— RamajogaiahSastry (@ramjowrites) September 9, 2026


