రాజమౌళి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఆర్ ఆర్ ఆర్ మళ్ళీ వాయిదాపడనుంది అని నిర్మాత డి వి వి దానయ్య హింట్ ఇవ్వడంతో సంక్రాంతి బరి ఖాళీ అయ్యింది. దీనితో మరి సంక్రాంతి బరిలో దిగే ఆ హీరోలు ఎవరనే ఆసక్తి మొదలైంది. ఐతే టాలీవుడ్ లోని ముగ్గురు టాప్ హీరోలకు మాత్రమే సంక్రాంతి బరిలో దిగే అవకాశం కలదు. మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివతో చేస్తున్న ఆచార్య ఇప్పటికే 40శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ మూవీని దసరా లేదా దీపావళి కానుకగా విడుదల చేయాలన్నది మేకర్స్ ప్రణాళిక. ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ వాయిదాతో ఆచార్య సంక్రాంతి పై కన్నేసే సూచనలు కలవు.
అలాగే బాలయ్య బోయపాటితో ఓ మూవీ మొదలుపెట్టారు. ఓ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ మూవీ లాక్ డౌన్ అనంతరం షూట్ మొదలుకానుంది. సంక్రాంతి హీరోగా ఉన్న బాలయ్య 2021 సంక్రాంతికి బోయపాటి చిత్రంతో ఖచ్చితంగా వస్తాడు అనిపిస్తుంది. అలాగే మరో స్టార్ హీరో ప్రభాస్ దర్శకుడు రాధా కృష్ణ తో చేస్తున్న పీరియాడిక్ లవ్ డ్రామా 50శాతం వరకు షూట్ పూర్తి చేసుకుంది. ఈ మూవీ కూడా సంక్రాతి బరిలో దిగే అవకాశం కలదు.
ఈ సినిమాల షూటింగ్స్ పూర్తి అయినా బిజినెస్ రీత్యా కొంచెం లేటుగా విడుదల చేయడమే బెటర్ ని నిర్మాతలు భావించవచ్చు. లాక్ డౌన్ తొలగించినప్పటికీ ప్రజల్లో కరోనా వైరస్ పై భయం పోయే వరకు థియేటర్స్ కి రారు. కావున ఈ ముగ్గురు హీరోలు లేటైనా కాసులు కురిపించే సంక్రాంతికి వచ్చే ఆస్కారం కలదు.


