ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఇంకా సస్పెన్సే !

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఇంకా సస్పెన్సే !

Published on May 16, 2020 8:49 PM IST

NTR 2

ఎన్టీఆర్ పుట్టిన రోజు మే 20న రాజమౌళి, ‘ఆర్ఆర్ఆర్’లోని తారక్ ఫస్ట్ లుక్ వీడియోను రిలీజ్ చేస్తాడా ? రిలీజ్ చేస్తే ఎన్టీఆర్ ఎలా కనిపించబోతున్నాడు ? ఇంతకీ జక్కన్న ఎలాంటి వీడియోను రిలీజ్ చేయనున్నాడు ? ఇలా ఎన్టీఆర్ పై వీడియో రిలీజ్ అవుతుందో లేదో అని ఇంకా సస్పెన్స్ లోనే ఉన్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఇంతవరకూ ఈ వీడియో పై ఎలాంటి అప డేట్ లేదు.

రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి ఈ విషయం పై మాట్లాడుతూ..’కరోనా కారణంగా వర్క్ పోస్ట్ ఫోన్ అయిందని.. అయితే అప్పటికీ తారక్ పాత్రకు సంబంధించి వచ్చిన అవుట్ ఫుట్ ను బట్టే రిలీజ్ చేస్తామని లేకపోతె లేదని రాజమౌళి స్పష్టం చేశాడు. అంటే రిలీజ్ అవుతుందా లేదా అని మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. దాంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను ఇంకా టెన్షన్ లో పెట్టినట్లు అయింది.

ఇక ఎన్టీఆర్ ఈ సినిమాలో మొత్తం రెండు గెటప్స్ లో కనిపిస్తాడట. తెలంగాణ యాసలో ఎన్టీఆర్ పలికే డైలాగ్ లు చాలా కొత్తగా ఉంటాయట. కాగా రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజులా, తారక్ కొమరం భీంలా నటిస్తున్న సంగతి తెలిసిందే. మొత్తానికి రాజమౌళి ఈ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో రూపొందిస్తున్నాడు.

తాజా వార్తలు