ఫైట్ తో స్టార్ట్ చేయనున్న ‘వకీల్ సాబ్’ ?

ఫైట్ తో స్టార్ట్ చేయనున్న ‘వకీల్ సాబ్’ ?

Published on May 23, 2020 10:52 PM IST

Vakeel Saab

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’తో మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తోన్నారు. ఈ సినిమా ఓపెనింగే ఫైట్ మీదే ఓపెన్ అవుతుందట. లాంగ్ గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద కనబడనున్న తొలి సీన్ ఫైట్‌ కావడం ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చే విషయమే. కాగా కరోనా అనంతరం మొదలవ్వబోయే షెడ్యూల్ లో మొదట ఈ ఫైట్ సీన్ నే షూట్ చేయనున్నారట.

ఇక ఈ రీమేక్ మూవీ ఒరిజినల్ వెర్షన్ కంటే కూడా చాలా భిన్నంగా ఉంటుందని తెలుస్తోంది. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు స్క్రిప్ట్ లో చాలానే మార్పులు చేశారట. ఈ సినిమా రిలీజ్ డేట్ ఆగష్టు నెలకు పోస్ట్ ఫోన్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. కానీ ఈ వార్తకు సంబంధించి ఇంతవరకూ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

కాగా పవన్ రీఎంట్రీ సినిమాని ఎప్పుడెప్పుడూ చేద్దామా అని ఆశగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. ఇక దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని బోని కపూర్ సమర్పిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు