నయనతార పై మళ్లీ రూమర్స్ !

నయనతార పై మళ్లీ రూమర్స్ !

Published on Jun 1, 2020 8:00 AM IST

Nayanthara

సౌత్ ఇండస్ట్రీలో ఏ స్టార్ హీరోయిన్ కు లేని విధంగా హీరోయిన్ నయనతార వ్యక్తిగత జీవితం ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ప్రస్తుతం విఘ్నేష్ శివన్ తో నయనతార పీకల్లోతు ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. నిజానికి వీరి ప్రేమాయణం చాలా ఏళ్లుగా నడుస్తూనే ఉంది. ఇద్దరూ తరచు తమ రిలేషన్ ఎలివేట్ అయ్యేలా హాలీడే ట్రిప్పులకు, పార్టీలకు వెళ్తుంటారు.

దాంతో వీరి వ్యక్తిగత బంధానికి శుభం కార్డ్ పలుకుతూ త్వరలోనే ఈ జోడీ వివాహం చేసుకోబోతున్నారని ఎప్పటినుండో తమిళ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మరి కరోనా వల్ల దొరికిన గ్యాప్ లో వీరిద్దరూ పెళ్లితో ఒక్కటయ్యే అవకాశం ఉందా అని కోలీవుడ్ లో రూమర్స్ స్టార్ట్ అయ్యాయి.

పెళ్లికి నయనతార తొందరపడకపోయినా విఘ్నేష్ శివన్ ఇంట్లో మాత్రం తొందరపెడుతున్నారట. అందుకే నయనతార కూడా పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని కోలీవుడ్ ఫిల్మ్ వర్గాల్లో చర్చ నడుస్తుంది. మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాలంటే నయనతార స్పందించే వరకు ఆగాల్సిందే.

తాజా వార్తలు