బాలయ్యను పవర్ హౌస్ తో పోల్చిన మహేష్

బాలయ్యను పవర్ హౌస్ తో పోల్చిన మహేష్

Published on Jun 10, 2020 4:01 PM IST

Balak

నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సంధర్భంగా ఆయనకు సినీప్రముఖులు మరియు అభిమానులనుండి బెస్ట్ విషెష్ దక్కుతున్నాయి. ఇప్పటికే చిరంజీవి, ఎన్టీఆర్, పూరి జగన్నాద్ వంటి అనేక మంది ప్రముఖులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. సూపర్ స్టార్ మహేష్ సైతం బాలకృష్ణకు బర్త్ డే విషెష్ చెప్పి ఆయనపై తనకు గల అభిమానం తెలుపుకున్నారు.

మహేష్ ట్విట్టర్ లో ‘ ఎనర్జీకి పవర్ హౌస్ లాంటి వారు, నేను ఎప్పుడూ అభిమానించే హీరో బాలకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు, మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి’ అని చెప్పారు. మహేష్ తమ అభిమాన హీరోకి శుభాకాంక్షలు చెప్పడం బాలయ్య అభిమానులకు ఆనందం కలిగించింది. ఇక మహేష్ తండ్రిగారైన కృష్ణ బాలకృష్ణతో కలిసి సుల్తాన్ అనే మల్టీ స్టారర్ చేయడం జరిగింది. ఇక కృష్ణ, ఎన్టీఆర్ కూడా కలిసి అనేక చిత్రాలలో నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు