కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు మన టాలీవుడ్ లో మంచి ఆదరణ ఉంది. మొదటి నుంచి తాను ఎంచుకునే సబ్జెక్టుల విషయంలో కానీ తనకు చేసే సినిమాలు అన్నా కానీ టాలీవుడ్ ఆడియెన్స్ లో మంచి ఒపీనియన్ ఉంది. అలా సూర్య చేసిన పలు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులలో “24” కూడా ఒకటి.
మూడు వేరియేషన్స్ లో సూర్య అద్భుతమైన నటన విక్రమ్ కె కుమార్ బ్రిలియంట్ డైరెక్షన్ మొత్తం ఇండియన్ సినిమా లవర్స్ ఒక కొత్త అనుభూతిని అందించాయి. టైం ట్రావెల్ కాన్సెప్ట్ ఎప్పుడు ఆసక్తికరంగానే ఉంటుంది.
అలాంటి కాన్సెప్ట్ తో వీరు చేసిన ప్రయోగం సూపర్ సక్సెస్ అయ్యింది. అయితే ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ కూడా వచ్చే సూచనలు ఉన్నాయని వినిపిస్తుంది. మరి ఇంకా దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది.


