టాలెంటెడ్ డైరెక్టర్ విక్రమ్ కుమార్, సూర్య కాంబినేషన్ లో 2016వచ్చిన చిత్రం 24. సైన్స్ ఫిక్షన్ మూవీగా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకాదరణను పొందింది.ఎప్పటి నుండో దీనికి సీక్వెల్ రానుందని వార్తలు వస్తుండగా దర్శకుడు విక్రమ్ కుమార్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ 24 సినిమాను చేసే సమయంలోనే నేను, సూర్య సీక్వెల్ చేయాలని అనుకున్నాం. ప్రస్తుతం ఆ సీక్వెల్‌కు స్క్రిప్ట్‌ను సిద్ధం చేస్తున్నాను. ముందు స్క్రిప్ట్ నాకు నచ్చితేనే నేను సూర్యను కలుస్తాను అని విక్రమ్ కుమార్ చెప్పారు. 24 చిత్రంలో సూర్య త్రిపుల్ రోల్ చేశారు. తండ్రి కొడుకులు మరియు విలన్ గా విభిన్న పాత్రలు ఆయన చేయడం జరిగింది.
కాబట్టి ఈ క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కాలంటే ముందు స్క్రిప్ట్ బాగా రావాలి. అప్పుడు మాత్రమే వీరిద్దరూ ఈ ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకెళతారు. ప్రస్తుతం సూర్య, లేడీ డైరెక్టర్ సుధా కొంగర దర్శకత్వంలో సురారై పోట్రు అనే బయోపిక్ లో నటిస్తున్నారు. షూటింగ్ చివరిదశలో ఉన్న ఈ మూవీ త్వరోనే విడుదల కానుంది.


