సెయాన్ : ‘గాడ్ ఆఫ్ వార్’ అంశంతో శివకార్తికేయన్ కొత్త మూవీ.. ఆకట్టుకుంటున్న అనౌన్స్‌మెంట్ వీడియో..!

సెయాన్ : ‘గాడ్ ఆఫ్ వార్’ అంశంతో శివకార్తికేయన్ కొత్త మూవీ.. ఆకట్టుకుంటున్న అనౌన్స్‌మెంట్ వీడియో..!

Published on Feb 17, 2026 11:35 AM IST

Seyon

తమిళ హీరో శివ కార్తికేయన్ నటిస్తున్న సినిమాలు వరుసగా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాపులుగా నిలుస్తున్నాయి. ఆయన నటించిన మదరాసి, పరాశక్తి చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ఇక ఇప్పుడు ఆయన మరో రూరల్ డ్రామా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నాడు.

రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, టర్మరిక్ మీడియా బ్యానర్లపై కమల్ హాసన్, ఆర్.మహేంద్రన్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాకు ‘సెయాన్’ (Seyon )అనే టైటిల్‌ను మేకర్స్ ఫిక్స్ చేశారు. శివకుమార్ మురుగేశన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ‘గాడ్ ఆఫ్ వార్’ మురుగన్(కుమార స్వామి) నేపథ్యంలో సాగనున్నట్లు తాజాగా రిలీజ్ చేసిన అనౌన్స్‌మెంట్ వీడియో చూస్తే అర్థమవుతోంది. ఈ సినిమాలో రఫ్ లుక్‌లో కనిపించే శివకార్తికేయన్‌కు మురుగన్ పూనడంతో ఆయనను ఊరేగింపుగా తీసుకెళ్తున్న సీన్ మనకు ఈ వీడియోలో కనిపిస్తుంది.

అయితే, ఈ వీడియోలో తమిళ నేటివిటీ ఎక్కువగా కనిపిస్తుండటంతో తెలుగు ప్రేక్షకులను ఇది ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి. మరోవైపు, ఇదే తరహాలో కుమారస్వామి నేపథ్యం ఉన్న ‘గాడ్ ఆఫ్ వార్’ కథతో టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కూడా ఒక భారీ సినిమా ప్లాన్ చేస్తున్నారు. మొదట అల్లు అర్జున్‌తో అనుకున్న ఈ ప్రాజెక్ట్, ఇప్పుడు ఎన్టీఆర్ హీరోగా పట్టాలెక్కే అవకాశం ఉందని సమాచారం. మరి శివకార్తికేయన్ తీసుకువస్తున్న ఈ సెయాన్ ప్రేక్షకులను ఎంతమేర మెప్పిస్తుందో చూడాలి. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ నెలలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తాజా వార్తలు