చరణ్ రిస్క్ తీసుకోవాలి అనుకోట్లేదా?

చరణ్ రిస్క్ తీసుకోవాలి అనుకోట్లేదా?

Published on Jun 19, 2020 3:09 AM IST

Ram Charan 2
ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో “రౌద్రం రణం రుధిరం” అనే ఓ భారీ పీరియాడిక్ పాన్ ఇండియన్ చిత్రంలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

అలాగే దీనితో పాటు బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో టాలీవుడ్ లెజెండరీ నటుడు మెగాస్టార్ చిరంజీవి హీరోగా “ఆచార్య” అనే ఓ చిత్రంలో కూడా ఒక కీలక రోల్ చేయనున్నారు అన్న విషయం కూడా విదితమే.

అలాగే ఈ చిత్రం షూటింగ్ కూడా ఇప్పుడిప్పుడే మొదలు కానుంది. అయితే ఈ చిత్రంలో తన టాకీ పార్ట్ కు ఇప్పుడప్పుడే నటించేందుకు చరణ్ అంతగా ఆసక్తి కనబర్చడం లేదని తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ అక్కడ కరోనా ప్రభావం ఎక్కువే మూలాన..

అందాక చరణ్ రిస్క్ తీసుకోకూడని అనుకుంటున్నారట. దీనితో పాటుగా తన తండ్రి ఆరోగ్యాన్ని కూడా రిస్క్ లో పెట్టకూడదని అందుకే ఈ చిత్రం షూటింగ్ విషయంలో అంతగా ఆసక్తి చూపడం లేదని వినికిడి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు