‘న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న ది మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘ది ప్యారడైజ్’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్గా ప్రేక్షకులను థ్రిల్ చేయడం ఖాయమని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా రిలీజ్ దగ్గరపడుతుండటంతో ఈ చిత్రానికి సంబంధించి టికెట్ రేట్ల పెంపు విషయంలో మేకర్స్ ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
ఈ చిత్రానికి టికెట్ రేట్లు రూ.50/ చొప్పున పెంచాలంటూ చిత్ర యూనిట్ ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలను కోరినట్లుగా తెలుస్తోంది. అంతకంటే ఎక్కువ పెంపు కోరితే ప్రేక్షకుల్లో నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ అయ్యే అవకాశం ఉందని మేకర్స్ భావించారట.
దీంతో ఈ సినిమాకు రూ.50 మేర టికెట్ రేట్ పెంపు లభించే ఛాన్స్ ఎక్కువగా ఉంది. జడల్ పాత్రలో నాని నటవిశ్వరూపాన్ని చూపించేందుకు సిద్ధమవ్వగా కయాదు లోహర్ హీరోయిన్గా నటిస్తుంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లడం ఖాయమని ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు ప్రూవ్ చేశాయి. సెప్టెంబర్ 24న ఈ చిత్రాన్ని గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.


