ఈ తరం హీరోలకు సిక్స్ ప్యాక్ అనేది తప్పకుండా ఉండాల్సిన క్వాలిటీ. ఇప్పటికే టాలీవుడ్ లో స్టార్ హీరోలతో పాటు అనేక మంది యంగ్ హీరోలు ఈ సిక్స్ ప్యాక్ క్లబ్ లో చేరారు. తాజాగా హీరో సందీప్ కిషన్ ఈ క్లబ్ లో చేరాడు. ఆయన కష్టపడి అదిరిపోయే ఆరు పలకల బాడీ డెవలప్ చేశారు. తన సిక్స్ ప్యాక్ బాడీకి సంబంధించిన ఫోటోలు సందీప్ సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఆ ఫోటోను చూసిన నెటిజన్స్ వావ్ అంటున్నారు. ప్రస్తుతం సందీప్ సిక్స్ ప్యాక్ తో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక ప్రస్తుతం సందీప్ ‘ఏ వన్ ఎక్స్ ప్రెస్’ అనే ఓ స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్నారు. హాకీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సందీప్ హాకీ ప్లేయర్ గా నటిస్తున్నారు. హీరోయిన్ గా లావణ్య త్రిపాఠి నటిస్తుంది. డెన్నిస్ జీవన్ దర్శకత్వంలో తెరకెక్కుతుండగా, హిప్ హాప్ తమిజ్ సంగీతం అందిస్తున్నాడు.


