కోలీవుడ్ స్టార్ నటుడు సూర్య హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ బ్యూటీ మమితా బైజు హీరోయిన్ గా తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి కలయికలో చేసిన సాలిడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ కోసం అందరికీ తెలిసిందే. సూర్య నుంచి మరో బ్లాక్ బస్టర్ గా వచ్చిన ఈ చిత్రం లేటెస్ట్ గా ఓటిటిలోకి కూడా వచ్చేసింది.
ఈ సినిమాని దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. కానీ ఇందులో వచ్చిన తర్వాత సూర్య టైటిల్ కార్డు అలాగే సెకండాఫ్ లో ఓ సీన్ దగ్గర విజువల్స్ ని సరిగ్గా సెట్ చేయకపోవడంతో ఫ్యాన్స్, నెట్ ఫ్లిక్స్ యూజర్స్ నిరాశ వ్యక్తం చేసారు. కానీ ఫైనల్ గా నెట్ ఫ్లిక్స్ ఈ రెండిటినీ సరి చేసి ప్రింట్ ని అప్డేట్ చేయడం జరిగింది.
ఈ సెప్టెంబర్ 13 నుంచి ఈ అప్డేట్ చేసిన ప్రింట్ స్ట్రీమింగ్ అవుతుంది. సో ఇక నుంచి ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి జీవి ప్రకాష్ సంగీతం అందించగా ఈ నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాణం వహించారు.


