సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో కొత్త ట్విస్ట్

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో కొత్త ట్విస్ట్

Published on Jul 21, 2020 1:32 PM IST

యంగ్ హీరో సుశాంత్ సింగ్ ఆత్మ హత్య కేసు విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తిని పలుమార్లు ముంబై పోలీసులు విచారణకు పిలవడం జరిగింది. అలాగే ఈ కేసులో బాలీవుడ్ బడా దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీని విచారణకు పిలిచి ఆయన స్టేట్మెంట్ నమోదు చేశారు. తాజాగా యష్ రాజ్ ఫిల్మ్స్ అధినేత ఆదిత్య చోప్రాను కూడా విచారణకు పిలిచి స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది.

కాగా సంజయ్ లీలా భన్సాలీ, ఆదిత్య చోప్రా సుశాంత్ విషయంలో ఇచ్చిన స్టేట్మెంట్స్ పొంతన లేకుండా ఉన్నాయని పోలీసులు తేల్చారు. సంజయ్ లీలా భన్సాలీ స్టేట్మెంట్ ప్రకారం…సుశాంత్ డేట్స్ కుదరక పోవడం వలనే భాజీ రావ్ మస్తానీ, రామ్ లీల మరియు పద్మావత్ చిత్రాలలో అవకాశాలు కోల్పోయాడు అన్నారు. కాగా ఆదిత్య చోప్రా మాత్రం ఆ చిత్రాలకు సుశాంత్ ని తీసుకుందామని సంజయ్ తనతో చెప్పలేదని, అన్నారు. ఒకే విషయంపై వేరువేరుగా ఉన్న వీరి స్టేట్మెంట్స్ అనేక అనుమానాలకు తావు ఇస్తున్నాయి.

తాజా వార్తలు