ఓటీటీ : ‘ఇరుముడి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే ?

ఓటీటీ : ‘ఇరుముడి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే ?

Published on Sep 13, 2026 10:03 AM IST

శివ నిర్వాణ దర్శకత్వంలో రవితేజ హీరోగా నటించిన సినిమా ‘ఇరుముడి’. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఐతే, ఈ సినిమా నాలుగో వారంలోకి అడుగుపెడుతున్న తరుణంలో, ఈ సినిమా ఓటీటీ విడుదలపై అధికారిక ప్రకటన వెలువడింది. సెప్టెంబర్ 18, 2026న పలు భాషల్లో డిజిటల్ వేదికపై ఈ సినిమా విడుదల కానుంది. నెట్‌ఫ్లిక్స్ ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’, ఇప్పుడు భారీ అంచనాల మధ్య స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోంది.

ఏది ఏమైనా ఈ సినిమాతో శివ నిర్వాణ స్థాయి పెరిగింది. ప్రధానంగా ‘ఇరుముడి’తో తనదైన మేకింగ్‌, కథన శైలితో దర్శకుడిగా శివ నిర్వాణ చాలా బాగా ఆకట్టుకున్నాడు. మొత్తానికి ఈ ఫ్యామిలీ థ్రిల్లర్ డ్రామా మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటించగా మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశారు.

తాజా వార్తలు