ఆసక్తిరేపుతున్న హన్సిక మహా పోస్టర్.

ఆసక్తిరేపుతున్న హన్సిక మహా పోస్టర్.

Published on Aug 9, 2020 6:11 PM IST

చైల్డ్ ఆర్టిస్ట్ గా బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన హన్సిక మోత్వానీ తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన దేశముదురు సినిమాతో హన్సిక హీరోయిన్ అయ్యింది. ఆ మూవీ మంచి విజయం సాధించడంతో టాలీవుడ్ లో ఆమె హీరోయిన్ గా సెటిల్ అయ్యింది. ఎన్టీఆర్ వంటి స్టార్ హీరో పక్కన కంత్రీ సినిమాలో ఆమె నటించడం జరిగింది. ఆమె టాలీవుడ్ లో ఫేడ్ అవుట్ అయ్యే క్రమంలో తమిళ్ పరిశ్రమపై ఫోకస్ పెట్టింది. అక్కడ ఆమె ఫుల్ సక్సెస్ కావడం జరిగింది.

కాగా యూఆర్ జామీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ పోస్టర్‌ని హన్సిక బర్త్‌ డే సందర్భంగా విడుదల చేసింది చిత్రయూనిట్. ఈ పోస్టర్‌లో హన్సిక చేతులు రక్తపు మరకలతో కనిపిస్తుండగా.. ఆమె నగ్నంగా ఉన్నట్లు కనిపిస్తుంది.ఈ సినిమాతో పాటు భాగమతి మూవీతో దర్శకుడిగా మంచి పేరు దక్కించుకున్న అశోక్ దర్శకత్వంలో ఒక వెబ్ సిరీస్ లో హన్సిక నటిస్తుంది. భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది.

తాజా వార్తలు