‘విశ్వంభర’కి లైన్ క్లియర్..? ఇప్పుడు అసలు డ్రామా షురూ!

‘విశ్వంభర’కి లైన్ క్లియర్..? ఇప్పుడు అసలు డ్రామా షురూ!

Published on Sep 14, 2026 12:00 AM IST

vishwambhara

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన లాంగ్ అవైటెడ్ చిత్రమే ‘విశ్వంభర’. కంటెంట్ పరంగా చిరు, దర్శకుడు వశిష్ఠ బలంగా నమ్ముతున్న ఈ సినిమాని ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ చిత్రం రిలీజ్ మాత్రం ఎంతకీ తేలకపోవడం నెమ్మదిగా అంచనాలు మందగించేలా చేసింది.

కానీ ఫైనల్ గా ఈ సినిమాకి ఓటిటి డీల్ ఖాయం కావడంతో ఇక రిలీజ్ డేట్ రావచ్చని తెలుస్తుంది. ఈ చిత్రానికి సోని లివ్ సహా అమెజాన్ ప్రైమ్ వీడియో వారు ఫ్రంట్ రేస్ లో స్ట్రీమింగ్ హక్కులు దక్కించుకునేందుకు వచ్చారు. కానీ ఫైనల్ గా ప్రైమ్ వీడియో మెగాస్టార్ సినిమా సొంతం చేసుకున్నట్టు ఇప్పుడు తెలుస్తుంది.

సో ఇక థియేట్రికల్ రిలీజ్ కి లైన్ క్లియర్ అయినట్టే.. కానీ ఇక్కడ నుంచే అసలు డ్రామా షురూ అవుతుంది. విశ్వంభర సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి విడుదల అంటూ ఆల్రెడీ ప్రచారం మొదలైంది. కానీ అదే సమయానికి బాబీ తెరకెక్కిస్తున్న ‘కాకా’ ని ఎట్టి పరిస్థితుల్లో తెస్తామని ప్రతీ చిన్న అప్డేట్ లో కూడా రిలీజ్ డేట్ మిస్ చెయ్యకుండా మేకర్స్ వేస్తున్నారు. సో ఈ రెండు సినిమాల విడుదల విషయంలో మంచి రసవత్తరమైన పరిస్థితి నెలకొంది. వీటితో ఏ సినిమా ఎప్పుడు వస్తుందో చూడాలి మరి.

తాజా వార్తలు