“ఆదిపురుష్” అప్పటికి సాధ్యమేనా.?

“ఆదిపురుష్” అప్పటికి సాధ్యమేనా.?

Published on Aug 19, 2020 9:15 AM IST

prabhas Adipurush

ఇప్పుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లైనప్ మాములుగా లేదు. తన ఒక్కో ప్రాజెక్ట్ కు ఒక్కో వైవిధ్యతను జోడిస్తూ దూసుకెళ్ళిపోతున్నాడు. అయితే కాలంతో పాటు తాను చేస్తున్న సినిమాలకు సమయం కూడా ఎక్కువగానే అయ్యిపోతుంది. దీనితో ప్రభాస్ చిత్రాలు అనుకున్న సమయం కంటే కాస్త ఎక్కువ సమయాన్నే తీసుకుంటున్నాయి. ఇదిలా ఉంచితే ఇప్పుడు ప్రభాస్ ఖాతాలో మూడు వరుస భారీ ప్రాజెక్టులు ఉన్నాయి.

వాటిలో దాదాపు చివరి దశలోనే ఉంది. “రాధే శ్యామ్” బ్యాలన్స్ ఉన్న షూటింగ్ అయ్యాక నాగశ్విన్ తో ఒక భారీ ప్రాజెక్ట్ ఉంది. దాని తర్వాత “ఆదిపురుష్” ఉంది. అయితే ఇక్కడే అసలు చిక్కు ఉంది. ఆదిపురుష్ టీమ్ వారు ఈ చిత్రాన్ని 2021లో పట్టాలెక్కించి 2022 లోనే తీసుకొచ్చేస్తాం అని అంటున్నారు. ఇప్పటికీ రాధే శ్యామ్ షూటింగ్ పూర్తి కాలేదు.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎపుడు మొదలవుతుందో కూడా అర్ధం కానీ పరిస్థితి. ఈ ఏడాది కూడా కావస్తుంది. మరి ఆదిపురుష్ 2021 లోనే మొదలైపోతే నాగశ్విన్ తో ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుంది?సో ప్రభాస్ రెండు చిత్రాల్లో ఒకేసారి పాల్గొంటారా లేక ఏ చిత్రాన్ని ముందు టేకప్ చేసి ముగిస్తారు అన్నది హాట్ టాపిక్ గా మారేలా ఉంది. మరి ఏం జరగనుందో కాలమే డిసైడ్ చెయ్యాలి.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు