ఇటీవలే టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ హీరోగా సీనియర్ అండ్ టాలెంటెడ్ దర్శకులు చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో “చెక్” అనే ఆసక్తికర ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసారు. దీనితో నితిన్ లైనప్ సాలిడ్ గా ఉందని ప్రూవ్ అయ్యింది. ఒక పక్క ఇలాంటి సినిమాలు మాత్రమే కాకుండా లవ్ స్టోరీ సహా ఫ్యామిలీ ఎంటెర్టైనర్స్ లో కూడా నితిన్ కనిపిస్తున్నాడు.
అలా ప్లాన్ చేసిన మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్ “రంగ్ దే”.కీర్తి సురేష్ ఈ చిత్రంలో నితిన్ సరసన హీరోయిన్ గా చేస్తుండగా యంగ్ దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించనున్న ఈ చిత్రంపై డీసెంట్ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ చిత్రం షూట్ కూడా పునః ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఈ షూట్ లో భాగంగా ఫారెన్ లో షెడ్యూల్ కూడా ఉంది.
కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేకపోడంతో రిస్క్ వద్దని దానిని ఇక్కడే షూట్ చెయ్యాలి అనుకున్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ షూట్ ను యూరోప్ లోనే ప్లాన్ చెయ్యాలని డిసైడ్ అయ్యారని తెలుస్తుంది. కొన్ని కీలక సన్నివేశాలు మరియు సాంగ్స్ కు సంబంధించి అక్కడ అయితేనే బెటర్ అని వీరు ఈ రిస్క్ తీసుకోనున్నారట. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి రేస్ లో నిలపనున్నారు.


