ఇప్పుడు ఇండియన్ సినిమా నుంచి రాబోతున్న అవైటెడ్ భారీ సినిమానే రామాయణ. రణబీర్ కపూర్, సాయి పల్లవి, యష్ లాంటి భారీ తారగణంలో దర్శకుడు నితీష్ తివారి తెరకెక్కించిన ఈ సినిమా నుంచి నిన్ననే ఫస్ట్ సింగిల్ మరియు ఓ కొత్త పోస్టర్ కూడా విడుదల చేసారు. అయితే ఈ సాంగ్ విన్నాక పలు విమర్శలు వచ్చిపడుతున్నాయి. అసలు సాంగ్ లో శ్రీకృష్ణ భగవానుని పేరు ఎందుకు వచ్చింది? అని అంటున్నారు.
రాముని అవతారం తర్వాత కృష్ణ అవతారం కదా కానీ అలాంటిది ముందే ఎలా సాహిత్యం లో పెట్టారు అంటూ విమర్శలు మొదలయ్యాయి. మేకర్స్ కనీస గ్రౌండ్ వర్క్ చేయలేదా అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి దీనిపై చిత్ర యూనిట్ ఏమన్నా స్పందిస్తుందా లేదా అనేది చూడాలి. ఇక ఈ సినిమాకి ఏ ఆర్ రెహమాన్ పాటలు అందిస్తున్నారు. అలానే నమిత్ మల్హోత్రా, యష్ నిర్మాణం వహించారు.


