రవితేజ నుండి మరో ఫుల్ ఎంటర్ టైనర్ !

రవితేజ నుండి మరో ఫుల్ ఎంటర్ టైనర్ !

Published on Oct 3, 2020 10:01 PM IST

raviteja

మాస్ మహరాజా రవితేజకి హిట్ లేకపోయినా ప్రస్తుతం వరుస సినిమాలను అంగీకరిస్తూ ముందుకు పోతున్నాడు. ఈ క్రమంలో రచయిత ప్రసన్న కుమార్ బెజవాడ రాసిన కథతో, ‘నేను లోకల్’ ఫేమ్ నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో రవితేజ ఓ సినిమా చెయ్యటానికి ఒప్పుకున్నాడు. కరోనా రాకపోయి ఉంటే… ఈ పాటికే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లేది. అయితే ఈ సినిమా గురించి ఒక ఇంట్రస్టింగ్ అప్ డేట్ తెలిసింది. ఈ సినిమా ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ అట, ముఖ్యంగా సినిమాలో రవితేజ క్యారెక్టరైజేషన్ ఫుల్ కామెడీ టైమింగ్ తో అద్భుతంగా ఉంటుందని.. చిరు ‘చంటబ్బాయి’ సినిమాకి ఈ సినిమా సీక్వెల్ గా ఉండబోతుందని తెలుస్తోంది.

ఏమైనా కేవలం తన మాడ్యులేషన్ తోనే అద్భుతమైన కామెడీని పండించగలడు రవితేజ. నిజానికి కిక్ తరువాత రవితేజ మళ్లీ ఆ రేంజ్ కామెడీ సినిమా చెయ్యలేదనే చెప్పాలి. ఈ సారి రవితేజ ప్రేక్షకులను ఫుల్ గా నవ్వించడం ఖాయంలా కనిపిస్తుంది. పీపుల్స్ మీడియా విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల ఈ సినిమాని నిర్మిస్తున్నారట. అన్నట్టు రవితేజ ప్రస్తుతం క్రాక్ మూవీలో నటిస్తున్నాడు. అలాగే రమేష్ వర్మ డైరక్షన్ లోనూ ఓ సినిమా చేయబోతున్నాడు. మొత్తానికి మాస్ మహరాజా రవితేజకి హిట్ లేకపోయినా ప్రస్తుతం వరుస సినిమాలను అంగీకరిస్తూ ముందుకు పోతున్నాడు.

తాజా వార్తలు