కంగనా ‘తలైవి’కి కొత్త సమస్య !

కంగనా ‘తలైవి’కి కొత్త సమస్య !

Published on Oct 4, 2020 12:19 AM IST


తమిళ ప్రజల ఆరాధ్య ముఖ్యమంత్రి జయలలితగారి జీవితం ఆధారంగా, బాహుబలితో నేషనల్ రైటర్ అయిపోయిన విజయేంద్ర ప్రసాద్ రాసిన కథతో, టాలెంటెడ్ డైరెక్టర్ ఏ ఎల్ విజయ్ దర్శకత్వంలో వస్తోన్న బయోపిక్ ‘తలైవి’. అమ్మ బయోపిక్ అనేసరికి మొదటినుండి ఈ సినిమా పై ఆసక్తి ఎక్కువైంది. ఈ బయోపిక్ లో జయలలిత పాత్రలో బాలీవుడ్ బోల్డ్ క్వీన్ కంగనా రనౌత్.. ఎం.జి.ఆర్ పాత్ర‌లో ప్ర‌ముఖ న‌టుడు అరవింద స్వామి చేస్తున్నారు. అయితే కంగనా రనౌత్ ను అచ్చం అమ్మలా మార్చెందుకు హాలీవుడ్ మూవీ ‘డార్కెస్ట్ హవర్’కి మేకప్ మెన్ గా పనిచేసిన ‘గ్యారీ ఓల్డ్ మెన్, ‘అమ్మ’ బయోపిక్ కోసం ఇండియాకి తీసుకువచ్చారు.

కాగా ఈ కరోనా సమయంలో ఆయన మళ్ళీ హాలీవుడ్ నుండి ఇండియాకి వచ్చే పరిస్థితి లేదు. దాంతో తరువాత జరగబోయే షెడ్యూల్ లో మేకప్ బ్యాచ్ మొత్తాన్ని మార్చాలి. ఇక జయలలిత జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలతో పాటు ఆమె చివరి రోజులను కూడా ఈ సినిమాలో చూపించనున్నారు. దాంతో కంగనా 18 ఏళ్ల వయసు పాత్ర నుండి నుండి 60 ఏళ్ల వయసు గల పాత్ర వరకూ ఈ చిత్రంలో కనిపించనుంది. ఈ క్రమంలో కంగనా మొత్తం నాలుగు గెటప్స్ లో కనిపించబోతుంది.

తాజా వార్తలు