తారక్, చరణ్ లతో పాటు అజయ్ దేవగణ్ కూడా.. !

తారక్, చరణ్ లతో పాటు అజయ్ దేవగణ్ కూడా.. !

Published on Oct 4, 2020 1:02 AM IST

ajaydevgan
దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో రాబోతున్న అత్యున్నత భారీ మల్టీస్టారర్ ‘రౌద్రం రణం రుధిరం’. ఈ సినిమాలో అజయ్ దేవగణ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ నెలాఖరులో మొదలుకానున్న షూట్ లో తారక్, చరణ్ లతో పాటు అజయ్ దేవగణ్ కూడా పాల్గొనబోతునట్లు తెలుస్తోంది. ఇక అజయ్ దేవగణ్ కీలకమైన ఓ ఫ్రీడమ్ ఫైటర్ పాత్రలో నటిస్తున్నారట. అయితే అజయ్ దేవగణ్ కేవలం కొన్ని సన్నివేశాల్లో మాత్రమే కనిపిస్తారట. అయినప్పటికీ.. అజయ్ దేవగణ్ పాత్ర వల్లే ఎన్టీఆర్ – చరణ్ పాత్రలు తమ ఆలోచనా విధానాన్ని మార్చుకుంటాయని.. మొత్తానికి అజయ్ దేవగణ్ పాత్ర ప్రేరణాత్మకంగా ఉండనుందని సమాచారం.

కాగా రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజులా, తారక్ కొమరం భీంలా నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ చిత్రంలోని కీలక పాత్రల కోసం విదేశీ నటీనటులు.. ప్రధానమైన విలన్ గా ఐర్లాండ్‌కు చెందిన నటుడు రే స్టీవెన్‌ సన్‌ ను, అలాగే లేడి విలన్ గా ఐరిష్ నటి అలిసన్ డూడీని తీసుకున్నారు. ఇక ఎన్టీఆర్ కి హీరోయిన్ గా ఒలివియా మోరిస్ ను తీసుకున్నారు. మొత్తానికి రాజమౌళి ఈ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో రూపొందిస్తున్నాడు. ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

తాజా వార్తలు