కింగ్ నాగ్ కూడా రిస్క్ తీసుకోనున్నారా?

కింగ్ నాగ్ కూడా రిస్క్ తీసుకోనున్నారా?

Published on Oct 4, 2020 9:00 AM IST

Wild Dog

టాలీవుడ్ ఆల్ టైం హ్యాండ్సమ్ హీరో కింగ్ నాగార్జున ఇప్పుడు తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్4 సీజన్ తో బిజీ గా ఉన్న సంగతి తెలిసిందే. అలాగే నాగ్ ఈ షో తో పాటుగా పలు చిత్రాలు కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. వాటిలో అహీషోర్ సాల్మన్ తెరకెక్కిస్తున్న థ్రిల్లర్ చిత్రం “వైల్డ్ డాగ్” కూడా ఒకటి. ఈ చిత్రం షూట్ కు కూడా నాగ్ ఈ మధ్యనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

అయితే ఇప్పుడు ఈ సినిమా విషయంలో నాగ్ కూడా రిస్క్ తీసుకోనున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే టాలీవుడ్ నుంచి పలు చిత్ర యూనిట్స్ ఇతర దేశాలకు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. అలాగే ఇపుడు వైల్డ్ డాగ్ యూనిట్ కూడా ఎప్పటి నుంచో ఆగిపోయిన ఓ షెడ్యూల్ ను థాయిలాండ్ లో ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఈ చిత్రం ఎప్పుడు మొదలు కానుందో చూడాలి.

తాజా వార్తలు