స్టైలిష్ స్టార్ ర్యాంపేజ్ కూడా మామూలుగా లేదు.!

స్టైలిష్ స్టార్ ర్యాంపేజ్ కూడా మామూలుగా లేదు.!

Published on Oct 4, 2020 10:00 AM IST

Allu Arjun 2

ఓ స్టార్ హీరోకు కేవలం ఆఫ్ లైన్ లోనే కాకుండా ఆన్ లైన్ లో కూడా ఏ స్థాయి ఫాలోయింగ్ ఉందో కూడా లెక్కలోకి వస్తుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో ఆ రికార్డులు ఈ రికార్డులు అని చాలానే వచ్చేసాయి. అలా మన టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు కూడా సోషల్ మీడియాలో ఏ స్థాయిలో క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే.

అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో కూడా భారీ ఎత్తున ఫాలోయింగ్ ఉంది. అయితే బన్నీకు సోషల్ మీడియాలో ఎప్పటి నుంచో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆ ఫాలోయింగ్ ఇపుడు లేటెస్ట్ గా రికార్డు స్థాయిలో వెళ్తుంది. లేటెస్ట్ గా స్టైలిష్ ఫేస్ బుక్ ఫాలోవర్స్ కౌంట్ 18 మిలియన్ మార్క్ ను టచ్ చేసింది.

దీనితో మన సౌత్ ఇండియా నుంచి భారీ ఫాలోవర్స్ ఉన్న మరో తెలుగు హీరోగా బన్నీ నిలిచాడు. ఈ మధ్యనే డార్లింగ్ హీరో ప్రభాస్ 20 మిలియన్ మార్క్ ను టచ్ చేసిన సంగతి తెలిసిందే. ఇపుడు బన్నీ కూడా అదే ఫీట్ వైపు వెళ్తున్నాడు. అది కూడా ఎలాంటి పాన్ ఇండియన్ మూవీ కూడా లేకుండా అంటే సోషల్ మీడియాలో బన్నీ ర్యాంప్ మామూలుగా లేదని చెప్పాలి.

తాజా వార్తలు