పూరి ‘ఫైటర్’కు లైన్ క్లియర్

పూరి ‘ఫైటర్’కు లైన్ క్లియర్

Published on Dec 8, 2020 2:09 AM IST

Vijay Devarakonda
సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో చేస్తున్న చిత్రం ‘ఫైటర్’. ప్యాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను ఛార్మి, కరణ్ జోహార్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. లాక్ డౌన్ వలన ఆగిన ఈ సినిమా చిత్రీకరణ ఇప్పటికీ రీస్టార్ట్ కాలేదు. కోవిడ్ సమస్యల మూలాన విదేశీ ఫైటర్లు దొరక్కపోవడంతో సినిమా ఆలస్యమైనట్టు వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడీ సమస్య పరిష్కారమైందట. ముంబైలోనే తిష్ట వేసిన పూరి సమస్యలను క్లియర్ చేసుకున్నారట.

దీంతో చిత్రికరణ జనవరి నుండి మొదలుకానుంది. అలాగే సంక్రాంతికి ఫస్ట్ లుక్ విడుదలచేసే ఆలోచన చేస్తున్నారట పూరి టీమ్. ఇందులో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే కథానాయికగా నటిస్తోంది. తెలుగుతో పాటు హిందీలో కూడ సినిమా రూపొందుతోంది. విజయ్ ‘అర్జున్ రెడ్డి’ మంచి విజయాన్ని అందుకోవడం, అది హిందీలో రీమేక్ కాబడి బ్లాక్ బస్టర్ కావడం,పూరికున్న క్రేజ్, కరణ్ జోహార్ నిర్మాతల్లో ఒకరు కావడం వంటి కారణాలతో బాలీవుడ్లో కూడ సినిమాపై మంచి క్రేజ్ నెలకొంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు