The Paradise: బుక్‌మైషో, డిస్ట్రిక్ట్ యాప్స్‌లో ‘ది ప్యారడైజ్’ జోరు.. నాని మూవీ బుకింగ్స్‌పై భారీ బజ్!

The Paradise: బుక్‌మైషో, డిస్ట్రిక్ట్ యాప్స్‌లో ‘ది ప్యారడైజ్’ జోరు.. నాని మూవీ బుకింగ్స్‌పై భారీ బజ్!

Published on Sep 17, 2026 3:00 PM IST

‘దసరా’తో బాక్సాఫీస్ వద్ద మాస్ జాతర చేసిన నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మళ్లీ జతకట్టడంతో ‘ది ప్యారడైజ్’ (The Paradise) పై మొదటి నుంచే భారీ హైప్ నడుస్తోంది. అయితే ఇంకా టికెట్ విండోస్ కూడా ఓపెన్ కాకముందే, టికెటింగ్ యాప్స్‌లో ఈ సినిమా చూపిస్తున్న దూకుడు ఇప్పుడు సినీ వర్గాలనే ఆశ్చర్యపరుస్తోంది.

బుకింగ్స్‌కు ముందే మొదలైన సెన్సేషన్

ప్రముఖ టికెటింగ్ ప్లాట్‌ఫామ్ బుక్‌మైషోలో ఇప్పటికే 2.16 లక్షలకు పైగా (216K+) ఇంట్రెస్ట్స్ నమోదవ్వగా, అటు డిస్ట్రిక్ట్ బై జొమాటో యాప్‌లోనూ 1.78 లక్షల మందికి పైగా (178K+) ఫ్యాన్స్ ఈ సినిమా కోసం హైప్ క్రియేట్ చేశారు. త్వరలోనే అధికారికంగా అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుపెట్టేందుకు మేకర్స్ రంగం సిద్ధం చేస్తున్నారు. సాధారణంగా బుకింగ్స్ మొదలయ్యాక కనిపించే తీవ్రత, ఇక్కడ విడుదలకు ముందే కనిపించడం ఈ చిత్రానికి ఉన్న క్రేజ్‌ను స్పష్టం చేస్తోంది.

‘జడల జమానా’కు రంగం సిద్ధం

శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో మోహన్ బాబు, రాఘవ్ జుయల్, సోనాలి కులకర్ణి, సంపూర్ణేష్ బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దీనికి రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. సీహెచ్ సాయి కెమెరా వర్క్, నవీన్ నూలి ఎడిటింగ్‌తో రూపొందుతున్న ‘ది ప్యారడైజ్’ సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు