“కేజీయఫ్ 2” క్లైమాక్స్ షూట్ పై లేటెస్ట్ అప్డేట్.!

“కేజీయఫ్ 2” క్లైమాక్స్ షూట్ పై లేటెస్ట్ అప్డేట్.!

Published on Dec 9, 2020 3:00 AM IST

ప్రెజెంట్ మన దక్షిణాది నుంచి వస్తున్న భారీ పాన్ ఇండియన్ చిత్రాల్లో కన్నడ రాకింగ్ స్టార్ యాష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “కేజీయఫ్ చాప్టర్ 2”. దేశ వ్యాప్తంగా స్కై హై అంచనాలను ఏర్పర్చుకున్న ఈ చిత్రం ఇప్పుడు క్లింక్ చిత్రీకరణలో ఉంది.

గత కొన్ని రోజుల నుంచి హైదరాబాద్ లో షూట్ ను జరుపుకుంటున్న ఈ చిత్రం తాలుకా షూట్ పై తాజా సమాచారం తెలుస్తుంది. ఇప్పుడు ఈ చిత్రంలో పవర్ ఫుల్ విలన్ గా కనిపిస్తున్న సంజయ్ దత్ మరియు యష్ ల నడుమ సీన్స్ తీయనున్నారు. అయితే ఇప్పుడు షూట్ కు గాను యష్ రేపు పాల్గొననున్నాడట.

అలాగే ఈ పవర్ ప్యాకెడ్ షెడ్యూల్ ఈ డిసెంబర్ మూడో వారం వరకు కొనసాగనున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ షూట్ అయ్యిన ఆ వచ్చే నెలలోనే దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో చేయనున్న “సలార్” కూడా స్టార్ట్ చేసేయనున్నారు. మొత్తానికి మాత్రం ఈ రెండు భారీ సినిమాలు కూడా ఇండియన్ బాక్సాఫీస్ పై గట్టి దాడి చెయ్యడానికి సన్నద్ధం అవుతున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు