హైదరాబాద్లో ఖరీదైన విల్లాను కొనుగోలుచేసిన స్టార్ హీరో

హైదరాబాద్లో ఖరీదైన విల్లాను కొనుగోలుచేసిన స్టార్ హీరో

Published on Dec 9, 2020 12:30 AM IST

Sudeep

తెలుగు సినీ పరిశ్రమలోకి ఇతర భాషల నటీనటులు వస్తుండటం మామూలే. కానీ వారిలో కొందరు మాత్రమే గట్టిగా నిలదొక్కుకుంటారు. అలాంటి వారిలో కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్ కూడ ఒకరు. కన్నడలో ఆయనో స్టార్ హీరో. అయినా తెలుగులో సపోర్టింగ్ రోల్స్ చేస్తుంటారు. పాత్ర బాగుండి, నటనకు ఆస్కారముంటే వెంటనే ఓకే చెప్పేస్తుంటారు. ‘రక్తచరిత్ర’ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన ఆ తర్వాత ‘ఈగ’ చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్నారు.

ఆ తరవాత చేసిన ‘బాహుబలి, సైరా’ సినిమాలు కూడ ఆయనకు మంచి ఫేమ్ తెచ్చిపెట్టాయి. తెలుగులో ఆయనకు మంచి ఆఫర్లే ఉన్నాయి. అందుకే ఆయన తరచూ హైదరాబాద్ వస్తున్నారు. పైగా కన్నడ సినిమాలు కూడ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంటాయి. కాబట్టి ఎక్కువగా హైదరాబాద్లో ఉండాల్సి వస్తోంది. అందుకే సిటీలో తనకంటూ ఒక ఇళ్ళు ఉంటే బాగుంటుందనుకున్న ఆయన గచ్చిబౌలి ప్రాంతంలో ఒక విలువైన విల్లాను కొనుగోలుచేసినట్టు తెలుస్తోంది. ఆ విల్లా ఖరీదు సుమారు 5 కోట్ల వరకు ఉంటుందని అంచనా.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు