జపాన్లో ఒక రేంజ్ అంటే ఏంటో ప్రూవ్ చేసిన ప్రభాస్.!

జపాన్లో ఒక రేంజ్ అంటే ఏంటో ప్రూవ్ చేసిన ప్రభాస్.!

Published on Dec 9, 2020 9:00 AM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లాస్ట్ భారీ యాక్షన్ పాన్ ఇండియన్ చిత్రం “సాహో”లో ఒక అదిరిపోయే డైలాగ్ ఉంటుంది. “గల్లీలో సిక్స్ ఎవడైనా కొడతాడు కానీ స్టేడియం లో కొట్టే వాడికే ఓ రేంజ్ ఉంటది” అని. ఇప్పుడు ఇదే డైలాగ్ లా ఇదే సినిమాతో ఊహించని ఫీట్ నే నెలకొల్పాడని చెప్పాలి.

బాహుబలి సినిమాతో ప్రభాస్ కు జపాన్ దేశంలో కూడా విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది.మరి ప్రభాస్ ను వారు ఏ స్థాయిలో దానిని “సాహో”తో మరోసారి వారు ప్రూవ్ చేసారు. అక్కడ సాహో సినిమాని విడుదల చెయ్యగా ఇప్పటికీ ఆడుతూ లేటెస్ట్ గా 250 రోజులను పూర్తి చేసుకుందట.

మామూలుగానే ఇలాంటి లాంగ్ రన్ మార్క్ రోజులు మన దగ్గర ఎప్పుడో పోయాయి. మరి అలాంటిది వేరే దేశంలో ప్రభాస్ ఇలాంటి ఫీట్ సెట్ చేసాడు అని ఆ డైలాగ్ ను గుర్తు చేసుకోవాల్సిందే మరి. మన ఇండియన్ స్క్రీన్ పై బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ గా యంగ్ డైరెక్టర్ సుజీత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించగా శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటించింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు