“బిగ్ బాస్ 4” లో ఈమెకు ఓట్ చేసి గెలిపించమంటున్న వర్మ.!

“బిగ్ బాస్ 4” లో ఈమెకు ఓట్ చేసి గెలిపించమంటున్న వర్మ.!

Published on Dec 9, 2020 2:00 PM IST

ఎప్పుడు తన సినిమాలతో ఏదొక సంచలనమో వివాదమో రేపే రామ్ గోపాల్ వర్మ ఆ సినిమాలతోనే బిజీగా ఉన్నాడనుకుంటే పొరపాటే వర్మ లేటెస్ట్ గా బిగ్ బాస్ షో ను కూడా చూడడం మొదలు పెట్టాడు అనిపిస్తుంది. ఇప్పుడు మన తెలుగులో ఎంతో రసవత్తరంగా సాగుతున్న బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 లాస్ట్ స్టేజ్ కు వస్తున్న ఈ షోలో మిగిలి ఉన్న కొద్ది మంది కంటెస్టెంట్స్ లో వర్మ ఓ కంటెస్టెంట్ కు ఓట్ వెయ్యమని చెప్పడమే కాకుండా..

ఆమెను ఈ సీజన్ విన్నర్ గా కూడా చెయ్యాలని పోస్ట్ చేసాడు. దీనితో నెటిజన్స్ వర్మ బిగ్ బాస్ చూడడం ఎప్పుడు మొదలు పెట్టాడు? ఈ షో కూడా చూస్తాడా అంటూ కామెంట్స్ వేస్తున్నారు. ఇంతకీ ఆ కంటెస్టెంట్ ఎవరో కాదు అరియాననే. రీసెంట్ గా మంచి గ్రాఫ్ ను తెచ్చుకున్న ఈ కంటెస్టెంట్ బిగ్ బాస్ టైటిల్ కు అర్హురాలు అని ఆమెకు అందరు ఓట్ చేసి గెలిపించాలి అని తన సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశారు. మరి సడన్ గా వర్మ దృష్టి బిగ్ బాస్ షో మీద ఎందుకు పడిందో తనకే తెలియాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు